సాధారణంగా చాక్లెట్ ఖరీదెంత ఉంటుందీ వంద రూపాయలు,ఇంకాస్త పెద్దవి,ఫ్రూట్ అండ్ నాట్ లాంటివి 150. కానీ ఈ చాక్లెట్ ఖరీదు 4. 3లక్షలు. ఐ.టి.సి ట్రినిటీ,ట్రిపుల్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫెబెల్స్ .ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి. చేత్తో చేసిన అందమైన చక్క పెట్టెలో ఈ చాక్లెట్ ప్యాక్ చేశారు. పదిహేను గ్రాముల చొప్పున పదిహేను విభిన్నమైన ట్రిపుల్స్ ఉంటాయి ఈ పెట్టెలో. ఈ చెక్క పెట్టె ధర అక్షరాలా లక్షరూపాయలు ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ చాక్లెట్ తయారీ నిపుణులు ఫిలిప్ కాంటిబిన్ తో కలిపి భారతీయ నిపుణులు ఈ ఖరీదైన చాక్లెట్ తయారు చేశారు.

Leave a comment