ఆన్ లైన్ విద్యా పద్ధతి లో పిల్లలు రాయడం మానేసి కీబోర్డ్ కే అలవాటు పడుతున్నారు కానీ నేర్చుకునే వయసు లో రాయడం వల్లనే ఎక్కువ ఫలితం అంటారు పరిశోధకులు.పెన్ను తో రాసే సమయంలో మెదడులోని రెండు భాగాలు కలిసి సమన్వయంతో పని చేస్తాయి.రాయటం ఆలోచించటం రెండు వేరు వేరు పనులు కానీ టైప్ చేసే సమయంలో ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండదని అంటున్నారు పరిశోధకులు. చేతుల కదలికలతో నాడులు చురుగ్గా మారతాయి ఫలితంగా మెదడు విషయాలను ఎక్కువగా గ్రహిస్తుంది అందువల్ల మనం చెప్పదలుచుకున్నవి టైప్ చేస్తూ, నేర్చుకునేందుకు మాత్రం చేత్తోనే రాయటం మంచిది అంటున్నారు పరిశోధకులు.

Leave a comment