అందరూ దళిత మహిళ జర్నలిస్ట్ లే నడుపుతున్న  ‘ఖబర్‌ లెహరియా’ న్యూస్ పేపర్ గురించి దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ‘రైట్‌ విత్‌ ఫైర్‌’ ఆస్కార్ 2022 బరిలో మన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయింది. 25 మంది దళిత మహిళా జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్ బుందేల్‌ ఖండ్ మధ్యప్రదేశ్ లలో గ్రామీణ వార్తలను స్త్రీల దృక్కోణం లోంచి అందించిన పత్రిక గురించిన డాక్యుమెంటరీ ఇది 2002లో ఖబర్ లహరియా వార్తాపత్రిక చిత్రకూట్ నుంచి (బుందేల్‌ ఖండ్) మొదలైంది. ఇవ్వాలా అందులో 25 మంది పనిచేస్తున్నారు. సెల్ ఫోన్ లు కెమెరా లుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించారో అదే ఈ డాక్యుమెంటరీ. దర్శకురాలు రింతు థామస్‌, మరో దర్శకుడు సుస్మిత్‌ ఘోష్‌ తో కలిసి ఈ డాక్యుమెంటరీ తీశారు.

Leave a comment