కరోనా వైరస్ చైనా లోని వూహాన్  లో విజృంభించిన తర్వాత లాక్ డౌన్ సమయంలో తన అనుభవాలు పుస్తకం గా తీసుకువచ్చారు చైనా రచయిత్రి ఫాంగ్ ఫాంగ్. ఇది కలం పేరు, ఆమె అసలు పేరు వాంగ్ ఫాంగ్. నిర్బంధాలను ఎదుర్కొన్న ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలలు కాలం  లాక్ డౌన్  లో రచయిత్రి ఆన్ లైన్ డైరీ రాశారు.ఇది సమాజ పరిస్థితులకే కాదు నోరు నొక్కేసిన ప్రజలు మానసిక స్థితిని కూడా ప్రతిబింబిస్తోంది.ఈ పుస్తకం ఈ ప్రపంచానికి ఒక హెచ్చరిక అంటున్నారు విమర్శకులు. మైఖేల్ బెర్రీ ఇంగ్లీషు లోకి అనువాదం చేసిన ఈ పుస్తకం డిజిటల్ ధర 469 రూపాయలు .

Leave a comment