ఎస్.రామకృష్ణన్ రాసిన యామం తమిళ నవల ను తెలుగు లోకి జిల్లేళ్ళ బాలాజీ అనువాదం చేశారు. ఠాగూర్ అవార్డ్ పొందిన ఈ నవల తమిళ సాహిత్యం లోనే ఒక విశిష్ట నవలగా పేరు తెచ్చుకొంది. ఈస్టిండియా కంపెనీ భారత దేశంలో కొల్లకొట్టాలనుకొంటున్న కాలం నాటి కథ ఇది నవలతో ఐదు కథలు. అత్తరు తయారు చేసే అబ్దుల్ కరీమ్ ఆంగ్ల వ్యాపారి ఫ్రాన్సిస్ డే,తమ్ముడి చదువుకోసం పంపి మరదలి తో కాపురం చేసి బిడ్డను కన్నా భద్రగిరి,కుక్క వెనకే తిరిగే సన్యాసి,తేయాకు తోటలు ఇండియాలో ఆరంభం కావటానికి తన ఎగువ కొండలో అవకాశం ఇచ్చిన క్రిష్టప్ప,ఎలిజిబెత్ ల కథలు వరుసక్రమంలో నడుస్తు వస్తాయి. యామం అన్నది అబ్దుల్ తయారు చేసిన అత్తరు పేరు. జీవితపు సువాసన. కాలం అనే చీకటి మాత్రమే శాశ్వతం. మనుషులు ఏ సువాసన మిగుల్చుకోకుండా జీవవాహిని లో కలిసి పోవటం నవల చెపుతోంది. ఈ గొప్ప నవల తప్పకుండా చదవండి.

  యామం
    రచన ఎస్.రామకృష్ణన్
   అనువాదం జిల్లేళ్ళ బాలాజీ ప్రతులకు సంప్రదించవలిసిన ఫోన్ నెం : 9444045947

Leave a comment