ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే  నొప్పులొస్తే కాళ్ళకి  పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు  వెచ్చని నీళ్లతో కాళ్ళని ఉంచితే నొప్పులు తగ్గుతాయి. నొప్పుల బాధించేంతగా ఉంటే డాక్టర్ సాయంతో వ్యాయామాలు ట్రై చేయచ్చు.

Leave a comment