ఇంట్లో వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖాన్ని యవ్వన వంత గా మార్చేందుకు ఉపకరిస్తాయి. కళ్ళకింద నల్ల మచ్చలు చింతపండుతో పోగొట్టవచ్చు ఇందులోని సిట్రిక్ యసిడ్ చర్మం అందంగా చేసేందుకు ఉపయోగపడుతుంది .పాలు చింతపండు ఈ రెండింటినీ మిక్సీలో వేసి గుజ్జులా చేసి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేస్తే నల్ల మచ్చలు ముడతలు పోతాయి. పసుపుకొమ్ములు వేయించి మెత్తగా పొడిచేసి ఆ పొడితో నలుగు పెట్టుకుంటే శరీరంలోంచి వచ్చే దుర్వాసన మాయమవుతుంది చర్మసౌందర్యం పెరుగుతుంది. ఆలివ్ లేదా బాదం నూనె ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం కాంతి గా ఉంటుంది.

Leave a comment