చర్మం అందంగా యవ్వనపు మెరుపుతో ఉండాలనుకొనేవాళ్ళు రోజూ రెండు నారింజ పండ్లు తినండి అంటున్నారు. కణాలను నాశనం చేసి వార్దాక్యాన్నీ తెచ్చిపెట్టే ప్రీరాడికల్స్ ను నారింజల్లోని హెస్పరిడిన్,హెస్పరెటెన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్ధవంతంగా అరికడతాయి. అందువల్లనే నారింజను తింటే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తారు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఎన్నో వ్యాధులకు ఇది నివారణగా ఉపయోగపడుతుంది. పీచు చాలా ఎక్కువ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అరికడుతుంది. ఉక్కువ పీచు ,తక్కువ కాలరీలు అందటం వల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల కాన్సర్ లను నివారిస్తాయి.

Leave a comment