చర్మం చక్కగా మెరిసిపోయేందుకు పూతల వేసుకొనే ఎన్నోరకాల క్లే లు మార్కెట్లో దొరుకుతున్నాయి.ముఖ్యంగా ముల్తానీ మట్టిలో ఉండే బ్లీచింగ్ గుణాలు చర్మ ఛాయను పెంచుతాయి గ్రీన్ క్లే సముద్రపు నాచు తో తయారు చేస్తారు.ఇందులో ఎంజైమ్ లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.దీన్ని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తే మొహం మెరిసిపోతుంది.  కేవోలిన్ క్లే  తెల్లగా మెత్తగా ఉంటుంది. ముఖం పై సహజ నూనెలను కాపాడుతుంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో దీన్ని పూతలా వేసుకుంటే ఇందులోని సహజమైన గుణాలు ముఖ చర్మాన్ని మెరిపిస్తాయి. యాక్టివేటెడ్ చార్కోల్ తో చేసే చార్కోల్ క్లే చర్మం పై మృతకణాలు తొలగిస్తుంది. మొరాకో పర్వతాల నుంచి సేకరించిన రసోల్ కె  లో ఖనిజాలు మెండుగా ఉంటాయి. గులాబీ నీటితో కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది.

Leave a comment