నిహారికా ,

అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ….! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే అన్యాయం. వీళ్ళు అలా  ఎలా ఉండగలిగారు మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనకు అలాగే వున్నామని తెలుస్తుంది. ఎలాగంటే ఎవరికి వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. కొందరి కళ్ళు బావుంటాయి . కొందరు బాగా మాట్లాడతారు కొందరు బాగా చదువుతారు. ఇవన్నీ మనిషిలో అందం కంటే ఎక్కువైనవి . వీటికి ప్రాధాన్యత ఇచ్చి చుస్తే అసలు అసలైన అందం ఏమిటి ? ఎలా ఉంటే మనం పనులన్నీ పర్ ఫెక్ట్ గా పూర్తిచేసినట్లు. ఇతరులతో పోల్చుకోవటం మానేస్తే కొంత క్లారిటీ వస్తుంది. ఫలానా జయంతి చాలా సన్నగా ఉంది . సరే నువ్వు ఆరోగ్యంగా వున్నావు అనుకోవాలి. ఫలానా వసంత తెల్లగా వుంది అంటే నువ్వు టాప్ గ్రేడ్ చదువులో ఉన్నవని గుర్తు తెచ్చుకోవాలి. మనం ప్రత్యేక మని మనం నమ్మటం మనం బాడీ లాంగ్వేజ్ ని మార్చేస్తుంది. బోలెడంత ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అందం చాలా ప్రత్యేకం.పువ్వులు జల పాతాలు  నెమళ్ళు పచ్చని చెట్లు అందమైన అమ్మాయిలు బావుంటారు. మనం అందాన్ని ప్రశంసించవచ్చు. కానీ మనం కూడా అలాగే ఉండాలనుకుంటే ఎంత అమాయకత్వం . కాస్త పొడుగ్గా ఉంటే కాస్త తెల్లగా  ఒత్తుగా ఉంటె ………  ఎందుకింత గందరగోళం ఏవీ ఇంకోలా అయిపోవు. పుట్టుకతో వచ్చిన రూపం తెలివి శక్తీ ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చిన తల్లితండ్రులకు మొదటి నమస్కారం పెట్టేసి ఇప్పుడు వెలుగులో  నిలబడి ఓకే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం  ఏమిటి అని ఆలోచిస్తే ఆడపిల్లలు ఇంకెంతో సాధిస్తారనిపిస్తుంది.

 

Leave a comment