కరోనా బాధితులకు సేవలు అందించే క్రమంలో ఆరోగ్య కార్య కర్తలు ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిర్విరామంగా మాస్క్ లు ధరించటం వల్ల చెవి నొప్పి దురద వస్తోంది. పేస్ బుక్ ద్వారా ఈ సమస్య తెలుసుకొన్న అమెరికాకు చెందిన క్రిస్టినీ లిసి తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఇయర్ సేవర్స్ తయారు చేసింది. రిబ్బన్ ముక్కుకు పెద్ద బటన్స్ కుట్టి వీటికే మాస్క్ లు తగిలించుకునే లాగా రూపాందించింది. చెవులకు కాకుండా ఈ రిబ్బన్ గుండీలకు మాస్క్ లు తగిలించుకోవచ్చు ఈ ఇయర్ సేవర్స్ ఐడియా బావుందని నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.

Leave a comment