పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్  చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ  సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన  లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్  ఫ్రూట్స్ ఓ గిన్నెడు తినాలి . మల్టీ  గ్రేయిన్ బ్రేడ్ టోస్ట్ కూడా శక్తి  ఇచ్చేది. ప్రతి రెండు గంటలకు ఆహారం తినాలి. డ్రెస్సింగ్ లేని సలాడ్స్ ఎంచుకోవాలి. బ్రు రోల్ బెల్ పెప్పర్స్ బేబీ టొమాటోలు చిలకడ దుంపలు పుచ్చ ఆరెంజ్ బెర్రీలు తినచ్చు . ఆరోగ్య వంతమైన సూప్స్ వాల్నట్స్ నువ్వులు పొద్దు తిరుగుడు గింజలు చాలా మంచివి. చక్కెర  లు తక్షణ శక్తీ ఇస్తాయి కానీ తర్వాత ఆ శక్తీ నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. కూర్చున్నప్పుడు పోశ్చర్  సరిగ్గా ఉంటే వెన్ను నొప్పి సమస్య ఉండదు. గంటకోసారి లేచి చుట్టు పక్కల నడుస్తూ స్ట్రెచ్ చేస్తుంటే ఈ సమస్య ఉండదు.

Leave a comment