Categories
Soyagam

ఈ చిట్కాలతో జుట్టు రాలదు.

జుట్టు వుదిపోవడం చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరికి సమస్యే ఇందుకు కారణాలు అనేకం. రసాయినాలున్న హెయిర్ డైల వంటివి వాడటం వల్ల కావొచ్చు, వయస్సు పెరగడం వల్ల పోషకాహార లోపం, హార్మోన్లు అసమతుల్యత ధైరాయిడ్ కారణం కావొచ్చు విటమిన్ల లోపం వాళ్ళను కూడా వెంట్రుకలు రాలిపోతాయి, వెంట్రుకలు వుదిపోకుండా కాపాడుకునే చిట్కాలున్నాయి. ఉల్లిపాయలో సల్ఫర్ చాలా ఎక్కువ ఇది జుట్టు కుదుళ్ళకు రక్తం సరఫరా అయ్యేట్టు చేస్తుంది. ఉల్లిపాయ రసం తీసి అందులో కలబంద రసం, ఆలివ్ ఆయిల్ కలిపి వెంట్రుకలకు పట్టించి స్నానం చేస్తే జుట్టు రాలదు. అలాగే కలబంద జెల్ కూడా చాలా మంచిది. ఆ జెల్ తలకు పట్టించి కొన్ని గంటల పాటు అలా వదిలేసి, ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వరంలో నాలుగైదు సార్లు చేస్తే మంచి ఫలితం వుంటుంది. బీట్ రూట్ జ్యూస్, గ్రీన్ టీ, ఉసిరి, వేపాకులు వంటి సహజమైన హెయిర్ మాస్క్ ల వల్ల కూడా మంచి ఫలితం.

Leave a comment