నీహారికా , నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయాలు భరించలేక పోతేనే కోపం వస్తుంది. నాదే సరైన మార్గం నేనే రైట్ అనుకోవటం వదిలేస్తే కోపం సగం వదిలిపోయినట్లు . ఎప్పుడు ఒక్కరే విజేత అవరు. అన్న చిన్న సూత్రం వంటపట్టించుకుంటే కోప నియంత్రణ సాధ్యం అవుతుంది. మనిషిలో భావోద్వేగాలు అన్నీ ఉండాలి. కోపంతో సహా కానీ అవిఅదుపులో ఉండాలి. ఒక అన్యాయం పట్ల మనకు మనకు స్పందించకపోతే దాన్ని ఎదిరించకపోతే అప్పుడు ధర్మాగ్రహం రాకపోతే సమాజానికీ మన వ్యక్తిత్వానికీ నష్టం. అలాగే అతిగా ప్రదర్శించే ఏ భావోద్వేగం కూడా ఇతరుల మెప్పు పొందావు. కానీ ఒక్క కోపం విషయంలో నష్టాన్ని కన్నా సమస్యలు వస్తాయి . అది ఒక ఉన్మాద స్థితి లాంటిదనుకో . ఏం చేస్తున్నామో ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఆలోచన లేని స్థితిలో వుంటాం కనుక స్నేహాలు బంధుత్వాలు ఎన్నో దెబ్బతింటాయి. ఎందరికో మనసు బాధ కలుగుతుంది. మనం అలా నొప్పించే పని ఎందుకు చేయాలి. చెప్పు నీకు కాస్త కోపం ఎక్కువే. కోపం మనుషులని కలపదు, దగ్గర చేయదు. ఆఫిసుల్లో ఇంట్లో సంసారాల్లో వాతావరణం చెడిపోయేది కోపం వల్లనే నమ్ము. ఆలోచించుకోమరి .
Categories
Nemalika

ఈ ఒక్క భావోద్వేగంతో కొండంత నష్టం

నీహారికా ,

నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయాలు భరించలేక పోతేనే కోపం వస్తుంది. నాదే సరైన మార్గం నేనే రైట్  అనుకోవటం వదిలేస్తే కోపం సగం వదిలిపోయినట్లు . ఎప్పుడు ఒక్కరే విజేత అవరు. అన్న చిన్న సూత్రం వంటపట్టించుకుంటే కోప నియంత్రణ సాధ్యం అవుతుంది. మనిషిలో భావోద్వేగాలు అన్నీ ఉండాలి. కోపంతో సహా కానీ అవిఅదుపులో ఉండాలి. ఒక అన్యాయం పట్ల మనకు మనకు స్పందించకపోతే దాన్ని ఎదిరించకపోతే అప్పుడు ధర్మాగ్రహం రాకపోతే సమాజానికీ మన వ్యక్తిత్వానికీ నష్టం. అలాగే అతిగా ప్రదర్శించే ఏ భావోద్వేగం కూడా ఇతరుల మెప్పు పొందావు. కానీ ఒక్క కోపం విషయంలో నష్టాన్ని కన్నా సమస్యలు వస్తాయి . అది ఒక ఉన్మాద స్థితి లాంటిదనుకో . ఏం  చేస్తున్నామో  ఎవరితో ఏం  మాట్లాడుతున్నామో ఆలోచన లేని స్థితిలో వుంటాం  కనుక స్నేహాలు బంధుత్వాలు ఎన్నో దెబ్బతింటాయి. ఎందరికో మనసు బాధ కలుగుతుంది. మనం అలా నొప్పించే పని ఎందుకు చేయాలి. చెప్పు నీకు కాస్త కోపం ఎక్కువే. కోపం మనుషులని కలపదు,  దగ్గర చేయదు. ఆఫిసుల్లో ఇంట్లో సంసారాల్లో వాతావరణం చెడిపోయేది కోపం వల్లనే నమ్ము. ఆలోచించుకోమరి .

Leave a comment