పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ, రాగులు, వీటిలో నీటితో త్వరగా కరిగే పీచు వుంటుంది. ఇది ఇతర పోషకాలను త్వరగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక రకం పిచు తాజా పండ్లు, కురగాయాల్లో వుంటుంది. ఇది త్వరగా కరగదు కానీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే డిటాక్స్ ఫియర్ గా పని చేస్తుంది. అధిక రక్త పోటు వుంటే పిచు పదార్ధాలు ఎంత తీసుకుంటే అంత మంచిది. పీచు వల్ల బరువు తగ్గడం చాలా సులువు. ఇవి పుష్కలంగా వున్న పదార్ధాలు కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనితో సన్నబడటం చాలా తేలిక. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. అరుగుదల సమస్యలు తలెత్తవు మధుమేహం వున్నవారు పిచు పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే చెక్కర స్తాయి అదుపులో వుంటాయి.

Leave a comment