రొజూ ఎక్కడో ఒక చోట కాసేపు నిలబడక తప్పదు. ఏ బిల్లు కట్టించేందుకు బస్ ఎక్కేందుకు పావుగంట నుంచి అరగంట లైన్లో క్యు లో నిలబడతాం కదా. ఆ సమయంలో చిన్ని వ్యయామాలు చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్ . సపోజ్ క్యులో నిలబడితే బుజం పైన వత్తిడి తేచి వీపు కండరాళ్ళు నొక్కినట్లుగా చేయండి. అలా పై సార్లు బుజం బిగిస్తూ వీపు కండరాళ్ళ తో పది సార్లు నొక్కి వదిలేయవచ్చు. పొట్ట గట్టిగా లోపలి లాగి వదలచ్చు. చేతులు రెండూ కింది వైపుకు బాగా లగినట్లు చేయవచ్చు. రెండు చేతులు వీపు వెనక్కి లాగి వదిలితే చేతి కండరాళ్ళు బలంగా అవుతాయి. ముని వేళ్ళ పైన లేపి మళ్ళి కిందకి వదిలేస్తే ఇంకో పదిసార్లు చేయొచ్చు. టేబుల్ దగ్గర కూర్చుంటే ఓ బంతిని చేతిలోకి తీసుకుని నొక్కుతూ వుంటే చేతి కండరాళ్ళు బలపడతాయి. ఏది చేసినా శరీరాన్ని వంచుతూ యాక్టివ గా వుంచాలి.
Categories