కదలకుండా కూర్చుంటే గుండె జబ్బులు,ఊబకాయం వస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నారు కానీ ఈ కరోనా సమయంలో దొరికిన సెలవు దినాలు మరింత సమస్యలు తెస్తున్నాయి అంటున్నారు వైద్యులు.గంటకోసారి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా అటు ఇటు తిరగకపోతే నరాలకు సంబంధించిన అనారోగ్యాలు తప్పవంటున్నారు.రోజులో నాలుగైదు సార్లు యోగముద్రలు సాధన చేయమంటారు యోగా గురువులు.యోగముద్రలో ధ్యానం, ప్రాణాయామం, చేస్తే రెట్టింపు ఫలితం వస్తాయంటారు. ముద్రలను ఒక చికిత్సగా సిఫార్స్  చేస్తున్నారు.వాయుముద్ర, వరుణముద్ర, శూన్యముద్ర, సూర్య ముద్ర, సహజ శంఖ ముద్రలు సక్రమంగా అభ్యాసం చేస్తే అన్ని రకాల ఒత్తిళ్లు దూరమై,ఆరోగ్యం సమకూరుతుంది అంటున్నారు.

Leave a comment