ఈ సంవత్సరం ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇచ్చే ‘యంగ్‌ ఇంజినీర్‌’ అవార్డ్ కు ఎంపికైయింది డాక్టర్ ముద్రికా ఖండేల్‌వాల్‌. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వఉండే సాంకేతికత తో మొదలు పెట్టి మహిళల వ్యక్తిగత ఆరోగ్యానికి ప్యాంటీ లైనర్ యాంటీ ఫంగల్ హైజీన్ ఉత్పత్తులు రూపొందించింది ముద్రికా. ఐ ఐ టీ ముంబాయ్ లో మెటలర్జికల్ ఇంజినీర్ ఎం టెక్ పూర్తిచేసి లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో పి హెచ్ డీ చేసింది ముద్రికా. ప్రస్తుతం ఐ ఐ టీ హైద్రాబాద్ లో అసోసియేట్ ప్రోఫెసర్ గా పని చేస్తోంది. మంచి ఉద్యోగ అవకాశాలున్న తన జ్ఞానం దేశం కోసం ఉపయోగించాలనుకున్నారు ముద్రికా.

Leave a comment