చదువుకొన్న వాళ్ళు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అంటుంది లక్షికా దాగర్.21 సంవత్సరాల రేడియో జాకీ లక్షికా దాగర్ ప్రస్తుతం ఒక గ్రామానికి సర్పంచ్ అయి, రాష్ట్రం లోనే యంగెస్ట్ సర్పంచ్ గా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌ పరిధిలోని చింతామన్‌ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయి లక్షికా మూడు వేలకు పైగా జనాభా ఉన్న చింతామన్‌ కు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్ట్ మహిళలకు కేటాయించారు. ఎస్సీ మహిళలకు కేటాయించారు ఈ ఎన్నికల్లో లక్ష 487 ఓట్లు మెజారిటీతో సర్పంచ్ సీట్ దక్కించుకుంది. భరత్ పూర్ జిల్లాలో కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో రీజనల్ అధికారిగా పనిచేస్తున్న దిలీప్ దాగర్ కూతురు లక్షికా. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా నంటోంది లక్షికా.

Leave a comment