మా తిరువనంతపురం చాలా అందమైన నగరం.వ్యర్ధాలు మా నగరపు అందాన్ని దెబ్బతీయకుండా చూస్తాను అందరికీ ఆరోగ్యం నా లక్ష్యం. అలాగే నా చదువును కొనసాగిస్తాను అంటోంది ఆర్య రాజేంద్రన్. 21 సంవత్సరాల వయస్సు.డిగ్రీ రెండో సంవత్సరం చదువు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతుంది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదావన్ ముకుల్  వార్డు కు సిపియం అభ్యర్థిగా పోటీ చేసింది రెండు వేలకు పైగా ఓట్లు తేడాతో ప్రత్యర్థిపై విజయాన్ని సాధించింది ఆర్యా రాజేంద్రన్.

Leave a comment