వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నాకో ఉత్తరం రాశారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో మీరు ఒకరిని నాకు తెలిసింది. ఇండియా,నేపాల్ దేశాలలో క్యాన్సర్ కేర్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఇతరులకు ఎంతో స్ఫూర్తి అని ఉత్తరం లో రాశారని సంతోషంగా చెబుతోంది మనీషా కొయిరాలా. 2012లో మనీషా ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడి ఐదేళ్ల  వైద్యం తర్వాత కోలుకున్నది. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారే యువరాణి రాసిన ఉత్తరం నాలో ఉత్సాహం నింపి క్యాన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి ఎంతో శక్తి ఇచ్చింది అని చెబుతోంది మనీషా కొయిరాలా.

Leave a comment