నాజూకు తనం మీదే సగం ప్రపంచపు ఆలోచనలు నడుస్తున్నాయి. ఎంతో బిజినెస్ నడుస్తుంది. ఎన్నో జిమ్ సెంటర్స్ బతుకుతున్నాయి. అసలు ప్రపంచం కుడా జీరో సైజ్ చుట్టూ ప్రదక్షణం చేస్తుంది. ఎంత నాజుగ్గా వుంటే అంట అందం అన్న ధియరీ ఏనాడో సక్సెస్ అయింది. కానీ ఈ సన్నని జీరో సైజు నడుము ఆకర్షణీయమె కానీ మధ్య వయస్సుకు వచ్చాక మాటకు ఇబ్బంది అంటున్నాయి అద్యాయినాలు. సన్నగా వున్నవాలు తల్లి కావడం కష్టం ఇందుకు కీలకపాత్ర పోషించే హార్మోన్ ఈస్ట్రోజెన్  ఉత్పత్తి సక్రమంగా జరగదు. ఎనిమిదేళ్ళ పాటు ఎన్నో దేశాల లోని క్ర్త్రిమ గర్భోత్పత్తి కేంద్రాలకు వస్తున్న మహిళల పై పరిశోధనలు జరిపి, సమాచారం సేకరించి ఈ నిర్ణయానికి వచ్చారు. భారీ శరీరం వుంటే తల్లి కావడం కష్టం అన్న మాట నిజమే కానీ, సన్నని వారి లో ఈస్ట్రోజెన్ వుతప్త్తి సరిగా జరగనందున గర్భాశయం పిండాన్ని  అందుకునేందుకు సిద్ధంగా వుందని పరిశోధకులు చెప్పుతున్నారు. జీరో సైజ్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకుని మరీ నాజుగ్గా వుండేందుకు ప్రయత్నించమంటున్నారు.

Leave a comment