దీవుల్లో సరస్సులు ఉంటాయి.కానీ ఈ సరస్సులో దీవులున్నాయి. వేయి దీవులు ఉన్న ఈ సరస్సు చైనా జె జి యాంగ్ రాష్ట్రం చునాన్ కౌంటీ లో ఉంది.అసలు పేరు చింగ్ డావ్ లేక్ .ఈ సరస్సు లో వెయ్యికి పైగా దీవులు ఉన్నందున దీనికి Zhejiang Thousand island lake అంటారు.ఈ సరస్సులో 1078 దీవులున్నాయి.చిన్నవి అయితే ఇంకెన్నో 573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సులో ఉన్న దీవులపై ఇళ్ళుంటాయి .ఈ ఇళ్లను కలుపుతూ వంతెనలు రహదారులు ఉంటాయి.ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్లేటప్పుడు పడవలను ఉపయోగిస్తారు స్థానికులు .ఇక్కడే నివాసం ఉండే కొందరికి సొంతంగా దీవులు కూడా ఉన్నాయి ఈ సరస్సులో కోతుల దీవి, పాముల దీవి, పక్షుల దీవి కూడా ఉన్నాయి.

Leave a comment