Categories
కాశ్మీర్ కు చెందిన 19 ఏళ్ల సానియా జెహ్రా తేనె, తేనెటీగలు పొడి తయారయ్యే ఉత్పత్తుల అమ్మకాలలో లక్షలు సంపాదిస్తోంది.ఆమె తండ్రికి తేనె వ్యాపారం ఉంది. తమ దగ్గర ఉన్న తేనెను వ్యాపారులు కల్తీ చేసి లాభాలు అర్జించటం చూసిన సానియా సొంతంగా తేనె వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. కాశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్ పేరుతో ఆమె తేనె చాలా స్వచ్ఛమైనది. అలాగే తేనెటీగలు సేకరించే పుప్పొడి వాటి స్రావాలు నుంచి ఆమె తయారు చేసే సబ్బులకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఇలాంటి వ్యాపారాలకు ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంటుంది.