చాలాకొద్ది మందికే కొన్ని ప్రతేకమైన సరదాలు ఉంటాయి. ఎపుడు చేయలేని పనులు చేసి రికార్డ్స్ బద్దలు కోట్టానుకుంటారు. ఇలాటి సరదాలు ఊరికే తీరవు. ఎంతో కృషి పట్టుదల సంకల్పబలం,పేరు తెచ్చుకొవాలనే బలమైన కాంక్ష అన్న ఉండాలి. ఢిల్లీకి చెందిన ప్రకాష్ రిషి ప్రపంచ రికార్డ్ కోసం శరీరం మొత్తం ట్యాటూలు వేయించుకున్నాడు మొత్తం 500ట్యాటూ 336దేశాల జాతీయ జండాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతులైన వాళ్ళ ముఖచిత్రాలున్నాయి. 1990 లో 1001 గంటలపాటు స్కూటర్ నడిపిన రికార్డ్ నాలుగు నిమిషాల్లో టమోటా కెచెప్ తగిన రికార్డ్ ,ముఖ్యంగా నోట్లో దంతాలన్నీ తీయించుకొని 496 స్ట్రాలు నోట్లో పెట్టుకొని సృష్టించిన రికార్డ్ ఇట్లో 20 రికార్డులు ఆయన పేరిట నమోదయ్యాయి ఈయన ఎవరికైనా ఆదర్శమే.