తాజా బత్తాయి రసం రోజూ ఒక గ్లాసు తీసుకుంటే నోటిపూత తగ్గిపోతుంది అంటున్నారు వైద్యులు. శరీరంలో పోషకాలు లోపిస్తేనే నోటిపూత వస్తుంది . అందుకే సి విటమిన్ పుష్కలంగా ఉన్న సంత్ర జ్యూస్ తీసుకోవాలి. తాజా కొబ్బరి పాలు కూడా నోటిపూతకు ఔషధం.రోజుకు రెండు మూడు సార్లు కొబ్బరిపాలు నోట్లో పోసుకొని పుక్కిలించాలి. కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతే వేడి నీళ్లలో టీ స్పూన్ ఉప్పు,పసుపు వేసి కలిపి ఆ నీటితో నోరు పుక్కిలిస్తూ ఉంటే కూడా నోటిపూత తగ్గుతుంది.పచ్చి కొబ్బరి ముక్కలు చేసి మెత్తగా గ్రైండ్ చేసి పిండితే వచ్చే పాలను ఫ్రిడ్జ్ లో ఉంచుకుని రోజంతా ఉపయోగించుకోవచ్చు .డీప్ ఫ్రీజర్ లో అయితే గడ్డ కడతాయి .కాసేపు బయట ఉంచితే మామూలు స్థితికి వస్తాయి. ఈ పాలతో పుక్కిలిస్తే రెండు మూడు రోజులకే నోటిపూత తగ్గిపోతుంది.
Categories