మనిషి సామాజిక జీవి. ఎప్పుడూ ఎవరో ఒకరితో సంబంధాలతో ఉండి గుంపులో గుంపుగా జీవించగలిగే వాడు.ఏ కారణం చేతైనా గుంపుతో లేదా మందలోంచి వేరు చేయబడిన జీవి ఎంత అలజడికి గురి అవుతోంది ఓ మనిషీ అంతే పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళయి ఇల్లు వదిలి వెళ్లిపోయాక చాలా మంది దంపతులు ఎదుర్కొనే పరిస్థితి ఇదే.అప్పటికే బంధుమిత్రులతో దూరం అవుతుంటాము పిల్లలు పెంపకంలో ఎవరికీ ఒక గంట సమయం కేటాయించలేక పోయినందువల్ల చుట్టూ వారితో మానసిక బంధం ఉండదు. అలాంటి సమయంలో ఏర్పడిన ఒంటరితనాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ మానసిక స్థితి నుంచి బయట పడటం కష్టం కాదు ఒంటరితనం ఒక భావన మాత్రమే నెమ్మదిగా సాంఘిక సంబంధాలను మెరుగుపరచుకోవడం మన ఇష్టాలకు దగ్గరగా ఉండే వారితో స్నేహం బంధాలు మెరుగుపరచుకోవడం ముందుగా ఈ ఒంటరితనం లోంచి బయటపడాలని నిర్ణయించుకోవటం సమస్యకు పరిష్కారం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134