మన దేశంలో 75 కోట్ల మందికి పైకాశామాజిక మధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారని ఒక సర్వే. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతుంది మాత్రం మహిళలే ఆడవారి శరీరాలపై జరిగే ట్రోలింగ్ తో వారు నిరాశ, ఆందోళన ఆత్మ న్యూనత తో కృంగిపోతున్నారట ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు జరుగుతూ ఉంటే వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆంధ్ర తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాలతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యచ్చు. అశ్లీలంగా అసభ్యంగా ట్రోల్ చేస్తే ఐటి సవరణ చట్టం 2008 సెక్షన్ 67.ఎ కింద శిక్షర్హులు.

Leave a comment