Categories
చీరెలు, ఓణీలు ,పరికిణీలు,అనార్కలీ,ఇంకా వెస్ట్రన్ కుర్తీలు ఎన్ని రకాల డ్రెస్ లు ఎంచుకొన్న హెయిర్ స్టైల్ ఒకే రకంగా ఉంచితే బావుండదు అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. ముఖం అందాన్ని పెంచే హెయిర్ స్టైల్ పైన దృష్టి పెట్టలి. ముందుగా జుట్టు పొడి బారకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఆలీవ్ లేదా ఆ కొబ్బరి నూనె తో తలకు మసాజ్ చేసి షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా పట్టులాగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఉంగరాలు తిరిగి ఉంటే దాన్ని స్ట్రయిటనింగ్ చేయటమో లేదా రోజు వారీ లుక్ కి భిన్నంగా ఉండేలా ప్రయత్నించాలి. చీరె కట్టుకొంటే మెస్సీ ,హెయిర్ బక్స్ ఫిష్ టైల్ బావుంటాయి. పరికిణీ ఓణీకి వాలు జడ బావుంటుంది. లేదా పక్క జడ అందమే. డ్రెస్ ను బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోమంటున్నారు స్టైలిస్ట్ లు.