Categories
పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు మనం తీపుకొనే పదార్థాలే కారణం అంటున్నారు వైద్యులు. కాయలు ,ఆకు కూరలు పండ్లపైన రపసాయనిక మందులు కలుపు మందులు విచ్చలవిడిగా పిచికారీ చేటయటం వల్ల అవి తినటం మరింత ప్రమాదకరం అవుతాయి. ఈ రసాయనాలు ఆకుకూరలు ,పండ్లుపైన పూతగానే కాదు వాటి లోపలకు ప్రవేశిస్తున్నాయి. వాటికి వాడిన మందుల ప్రభావం క్యాన్సర్ ప్రమాదం తెస్తుంది. కూరగాయాలు ,పండ్లు ఇంటికి తేగానే ఉప్పు వేసిన వేడినీటిలో కడిగి ఆరబెట్టి వాడుకోవటం ఒక్కటే పరిష్కారం లేదా రసాయనాలు వాడని ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వెళ్ళటం ఇవి కాస్త ఖరీదు. కనుక ప్రతి పండుని ,కాయగూరలని వేడినీళ్ళతో చక్కగా ఒకటికి రెండు సార్లు కడగటం ఉత్తమం.