Categories
మనసు బాగోలేకపోయినా ఏదో వెలితిగా ఏ పని చేయాలని అనిపించకపోయినా డోపమైన్ డ్రెస్సింగ్ కు ప్రయత్నించాలి. మంచి రంగు రంగుల డిజైన్ ల డ్రెస్ లు వేసుకోవాలి. చక్కని నగలు, పెర్ఫ్యూమ్ తో చక్కగా తయారవ్వాలి. మన మనసుకి మనం ఒక బహుమతి ఇవ్వాలన్న మాట బాధపడే మనసు సేదదీరేలా చక్కని దుస్తులు షాపింగ్ చేయచ్చు. సంతోషం కలిగించే రంగుల్లో ఎరుపు, తెలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం ఉన్నాయి. ముఖ్యంగా పసుపు వర్ణం సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మనసుకి బాధ కలిగితే వెంటనే దాన్ని ఆనందం పెట్టడం చాలా అవసరం.