Categories
సుగంధ ద్రవ్యాలతో కిల్లి ఆరోగ్యన్ని ఇవ్వలేదు గానీ ,వట్టి తమల పాకుల్లో మాత్రం ఔషధ విశేషాలు బోలెడున్నాయి . విటమిన్ సి ,థైమిన్ ,నియాసిన్ ,రైబో ప్లేవిన్ ,కెరోటిన్ సమృద్ధిగా కాల్షియం ఉన్నాయి . రెండు నెలల పాటు రోజుకు రెండు ఆకులు తింటే కాల్షియం లోపం పోతుంది . రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ తమలపాకు రసం కలసి వంటికి పట్టించి ఓ పావు గంట ఆగి స్నానం చేస్తూపోతే చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి . ఆర్థరైటిస్ ,కీళ్లనొప్పులతో బాధపడే వాళ్ళు ఆ భాగాల్లో తమలపాకు రసం రాసి పైన తమలపాకుని అంటించి కట్టు కడితే ఉపశమనం గా ఉంటుంది . ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు .