Categories
Top News

తల్లి అశాంతిగా వుంటేనేఈ స్థితి

ప్రతి విషయానికి ఒక కారణం వుంటుంది. మనుష్యుల ప్రవర్తన వెనక పెంపకం తీరుంటుంది. కొన్నింటికి తల్లి కడుపులోనే బీజం పడుతుంది. కొంతమంది పిల్లలు మొండిగా, పెంకి తనంగా ఏడుస్తూనే వుంటారు. ఎంత ఊరడించిన అంతే. కాసేపు కూసేపు కాదు దాదాపు రోజంతా అలా చిరాగ్గా ఏడుస్తారు. సరిగా తిండి తినరు, అలంటి ప్రవర్తన పిల్లల్లో ఎందుకుంటుంది అని పరిశోధన చేస్తే ఆశ్చర్యంగా ఆ ఏడుపులకి తల్లే కారణం అని తేలింది. గర్భిణిగా ఉండగా తల్లి ఎదుర్కొన్న ఒత్తిడీ, ఒంటరితనం, బాలింతగా ఎదుర్కొన్న వేదన బిడ్డలో ఈ పరిస్థితి కలిగేలా చేస్తాయి. గర్భిణిగా ఉండగా తల్లిపై చుట్టూ ఉన్నవారి ప్రభావం ఎలా ఉంది. భర్త అందించే ప్రేమాభిమానాలు బట్టే బిడ్డ సంతోషంగా ఉంటుంది. గర్భంలో ఉన్న శిశువుకి తండ్రితో పాటు చుట్టూ సమాజపు ప్రేమ కూడా కావాలి. అవన్నీ పుష్కలంగా ఉండే పిల్లల్లో ఏడ్చే గుణం చాలా తక్కువ. వాళ్ళు తక్కువగా ఏడుస్తారు. ఆరోగ్యంగా వుంటారు. రుచిగా ఉండే పదార్ధాలను ఆనందించి చక్కగా తింటారు. ఇదీ అధ్యయనం రిపోర్ట్. తల్లిని సంతోషంగా ఉంచండి అంటున్నాయి పరిశోధనలు.

Leave a comment