Categories
అందమైన జమ్దానీ చీరె మూలలు బంగ్లాదేశ్ లో ఉన్న అద్భుతమైన రూపంలో ఉండే దీన్ని రాయల్ చీరె గా భావిస్తారు దీన్ని మస్లిన్ చీరె గా కూడా పిలుస్తారు. నేసేందుకు చాలా సమయం పడుతుంది. అసలీ చీరె అర్థమే అందమైన పువ్వులు నమూనా అని.చాలా జాగ్రత్తగా వెండి బంగారు దారాలు కలిపి అల్లుతారు చిన్న చిన్న పువ్వులు, ప్రకాశవంతమైన రంగులతో చాలా పలచగా మృదువుగా ఉంటుంది. సాంప్రదాయ ఆభరణాలతో, ఈ పురాతన సాంప్రదాయ నేత చీరె మరింత శోభాయమానంగా ఉంటుంది. ఈ చీరెను శుభ్రమైన వస్త్రంతో చుట్టి ప్లాస్టిక్ సంచిలో ఉంచి దాచాలి. చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది.