ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కిందనే ఈ భోజనాలు చేస్తుంటారు. ఇంత పవిత్రంగా చూసే ఈ వుసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రతోజనాలున్నాయి. ఉసిరి లో నీరు, పీచు శాతం కుడా ఎక్కువే. ఈ రెండు జీర్ణ శక్తిని పెంచుతాయి. యాంటీ జీర్ణ శక్తి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సమృద్దిగా వుండే ఉసిరికాయను ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి లోని కాల్షియం తోడ్పడుతుంది. ఉసిరి లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను కాంతివంతంగా ఉంచుతాయి. వయస్సు పైబడిన లక్షణాలు కన్పించనీయవు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఉసిరి. అన్నింటికంటే ముఖ్యం జుట్టుకు ఉసిరి చేసే ఉపకారం ఇంకేదీ చేయలేదు. జుట్టు నల్లబరిచేందుకు చక్కగా ఎదిగేందుకు, జుట్టును పరి రక్షించేందుకు ఉసిరి ఎన్నో విధాలుగా పనికి వస్తుంది వుసిరిని నిల్వ చేసుకుని సంవత్సరం పొడుగునా రోజు ఒక కాయు తింటే ఆరోగ్య పరంగా ఎంతో లాభం.
Categories