మధ్యప్రదేశ్ లోని అలంపూర్ లో పుట్టిన మానా మాండ్లేకార్ కూలి చేసుకొనే కుటుంబంలో ఎప్పుడు పస్తులతోనే బతికేది.మగపిల్లలు తిన్న తర్వాతనే ఆడపిల్ల మిగిలిన ఆహారం తినాలి.సగం ఆకలితో తొమ్మిది కిలో మీటర్లు నడిచి బడికి వెళ్ళేది.డిగ్రీ తర్వాత కరాటే నేర్చుకొంది.జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళింది.2017 లో టింకా సామాజిక పేరుతో ఒక సంస్థ నెలకొల్పి 76 వేల మందికి పైగా గ్రామీణ బాలికలకు కరాటే నేర్పింది.లింగ వివక్ష స్వీయ హక్కులు,నెలసరి పరిశుభ్రత పై అవగాహన పెంచేలా పాఠాలు నేర్పింది.మానా మండేకర్ ను నారి శక్తి సమ్మాన్ తో సహా ఎన్నో అవార్డులు వరించాయి.

Leave a comment