మైలకోకతోడ మాసిన తలతోడ
నొడలు మురికి తోడ నుండెనేని
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు
విశ్వదాభిరామ వినురవేమ.

మురికి బట్టలు మాసిన తల దేహం మీద మురికితో ఉంటే ఎలాంటివాడినైనా ఎవరూ మెచ్చరు. అన్నాడు ఏనాడో యోగివేమన మొదటి పరిచయం తో ఎదురుగా ఉన్న వ్యక్తిని అంచనా వేసేందుకు, మొహంలో చిరునవ్వు వేసుకున్న దుస్తులు బాడీ లాంగ్వేజ్ పరిగణనలోకి వస్తాయి. మన వృత్తి వ్యాపారాల్లో ఎవరో తెలిసిన వాళ్లతోనే లావాదేవీలు ఉండవు తెలియని వ్యక్తులతో డీల్ చేయాలి.అవతలి వాళ్ళు మనల్ని గుర్తించి అంచనా వేసేందుకు ముందుగా చూసేది మన వేషధారణ మాత్రమే కార్పొరేట్ సంస్థల్లో కూడా డ్రెస్ కోడ్ వుండేది ఇందుకే ఖరీదైన దుస్తులు కొనక్కర్లేదు చక్కగా మడత నలగకుండా ఉండాలి తల నీటుగా చదువుకొని కనపడాలి. మొహం పైన చిరునవ్వు ఒక్కటే ఆభరణమై ముందు వరుసలో నిలబెడుతుంది.

చేబ్రోలు శ్యాంసుందర్
9849524134

Leave a comment