భీమ్లా నాయక్ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన సెబుతున్నా నీ మంచి సెడ్డ పాటను సాహితి చాగంటి తో కలిసి పాడింది కుమ్మరి దుర్గవ్వ. ఆ పాట విడుదలైన రోజు 60 లక్షల మంది వీక్షకుల అభిమానం పొందింది. ఆశువుగా పాటలు కట్టేసి పాడే దుర్గవ్వ మంచిర్యాల దగ్గరలోని కోటిపల్లి దగ్గర ఉన్న రొయ్యల పల్లి కూలీ చేస్తూ బిడ్డలను పోషించుకునే దుర్గవ్వ సంబరాలు, పండగల్లో పాటలు అల్లుకుని పాడేది కూతురి ప్రోత్సాహం తో పాడిన, ఉంగురమే రంగైన రాముల రాములాల పాట లో వీక్షకుల ముందుకు వచ్చింది తమన్ దర్శకత్వం లో పాడిన సెబుతున్నా నీ మంచి సెడ్డ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది.