Categories
మన దేశపు మొట్టమొదటి మహిళా ఎంబి.బి.ఎస్ డాక్టర్ భక్తి యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన గైనకాలజిస్ట్ భక్తి యాదవ్ 69 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. 1948 నుంచి 91 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎన్నో వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఏజెన్సీ ప్రాంత మహిళలకు వేల మందికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడినందుకు, ముఖ్యంగా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేసేందుకే ప్రయత్నం చేసినందుకు ఆమెకు భారత ప్రభుత్వము అన్ సంగ్ లీడర్స్ కేటగిరిలో 2017 వ సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం అందించారు ఆమె చేతితో పది వేల మంది పిల్లలకు ఉచితంగా పురుడు పోశారు. 2017 ఆగస్టు 14వ తేదీన ఆమె చివరి శ్వాస తీసుకున్నారు ఆమె లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు.