మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉన్న ,థైరాయిడ్ సమస్య వల్ల విటమిన్ బి12 లోపం వల్లనూ జుట్టు తెల్లబడుతుంది. ఎండలో తిరిగినా ,రేడియేషన్ చికిత్సలు చేయించుకొన్న ఫ్యాషన్ కోసం డైలు మారుస్తూ ఉన్న ,ఆహారపరంగా శీతల పానీయాలు ,జింక్ ఫుడ్ ,పిండి పదార్థాలు తినటం ఇలా ఎన్నో కారణాలతో జుట్టు తెల్లబడువచ్చు. చికిత్సలు దాదాపు లేనట్లే .ఇంట్లో సహజంగా చేసుకొనే చికిత్స వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి ఆ నూనె వడకట్టి వాడుకోవాలి. ఈ నూనెలోనే రెండు స్పూన్లు మెంతుపొడి ,ఉసిరి పొడి కలిపి తలకు పెట్టుకొని గంట అయ్యాకా కడిగేయాలి. కొబ్బరి నూనెలో గంట గలగరాజు పొడి వేసి బాగా వేడి చేసి నిల్వ చేసుకొని తలస్నానానికి గంట ముందు రాసుకొవాలి లేదా రాత్రి వేళ రాపుకొని రాత్రంతా అలా వదిలేసి ఉదయం స్నానం చేయాలి. ఈ నూనె సహాజమైన రంగులా పని చేస్తుంది.

Leave a comment