స్వీడన్ లో ఒక మ్యూజియం ఉంది Disgusting food museum. 80 దేశాల నుంచి వచ్చే మనం ఎన్నడూ ఊహించని పదార్ధాలతో చేసిన వంటకాలుంటాయి. స్వీడన్ లోని మాల్మో పట్టణంలో ఉండే ఈ మ్యూజియంలో రుచి కాదు ,కనీసం కంపు కూడా భరించలేనట్టి ఆహారం ఉంటుంది. ఈ మ్యూజియం చేశాక మనం అనారోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకొనగలుగుతాం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఈ ఫుడ్ గురించి ఇది అసహ్యం ,ఇది ఇష్టం అని చెప్పటం ఎంత వరకు సబబు ,ఈ కూర కొందరు తినే ఆహరమే కదా అంటారు నిర్వహకులు. చుంచు పిల్లలతో చేసిన జ్యూస్ ,కోతి మెదడు ,బుల్ పెనిస్,గబ్బిలాల ,పక్షులతో చేసిన ఆమారం చూస్తేనే వాంతి వచ్చేలా ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్తగా కొద్దీ ఇందులో ప్రవేశించే ముందరే మనకో వామిటింగ్ బ్యాగ్ ఇస్తారు. ఆయా దేశాల సంస్కృతుల్లో ఆచారవ్యవహారాల్లో భాగంగా తయారు చేసుకొనే ఆహారాలు ఇక్కడ ఉంటాయి.

Leave a comment