చాక్లెట్ ఫేషియల్ తో ముఖ సౌందర్యం రెట్టింపు గా అవుతుంది అంటారు ఎక్స్పర్ట్స్.చాక్లెట్ ను కరిగించి దానికి స్పూన్ తేనె, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి పూతలా వేసుకోవాలి.ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి చాక్లెట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపు ఇస్తాయి. అలాగే చాక్లెట్ ను కరిగించి అందులో పాల పొడి నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఆరిపోయాక శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.

Leave a comment