Categories
బయటి వాతావరణం లోని దుమ్ము ,ధూళితో చర్మం ,శిరోజాలు నిర్జీవంగా అయిపోతాయి . ముదురు పసుపు రంగులో ఉండే మెంతుల్లో ఉండే ఘాటైన సుగంధతైలాలు ఈ సమస్యను పోగొడతాయి . గింజల్లో ఉండే ఔషధతత్వం జిగురు పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి . పాలల్లో ,మెత్తగా చేసిన మెంతుల పొడిని కలిపి పేస్టు లా చేసి ప్యాక్ వేస్తే ముఖచర్మం బిగుతుగా అవుతుంది . ఓ అరగంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది . కరివేపాకు మెంతి ఆకులు మెంతులు కలపి మెత్తగా పేస్టు చేసి తలకు పట్టిస్తే నిర్జీవంగా ఉండే జుట్టు మెత్తగా పట్టులా అయిపోతుంది . మెంతుల్ని రాత్రి వేళ నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే రుబ్బి తలకు పెట్టుకోవాలి .