ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మనకు 405 ఏళ్ళ పాటు కొనసాగిన ఆచారానికి ఇద్దరు ఆడపిల్లలు ముగింపు పలికారు యూపీ లోని వారణాసి లో తులసీ దాస్ అఖీరా అనే స్త్రీలకు ప్రవేశం లేని మల్ల యుద్ధం శిక్షణా కేంద్రం నడుస్తుంది. పదేళ్ళుగా అక్కడ మల్ల యుద్ధంలో శిక్షణ ఇమ్మని అడుగుతున్నారు. నందితా, ఆస్ధాన్ అనే ఇద్దరమ్మాయిలు. వాళ్ళు ఒప్పుకోలేదు . నిరుపేదలైన ఒక ప్రైవేట్ సిక్షకుడి దగ్గర మల్లయుద్ధం నేర్చుకున్నారు. చివరికి ఈ ఏడాది ఆగస్టు లో ఆఖరి గురువు దగ్గరకు పోయి తమ ప్రాధాన్యం చూపించి ఆడవాళ్ళకు ప్రవేశం ఇమ్మని కోరారు. అఖీరా నిర్వహించే మహంత్ దిగి వచ్చి, స్త్రీ లకు ప్రవేశార్హాత కల్పించి, పోటీలు కుడా నిర్వహించారు. 45 ఏళ్ళుగా ఈ అఖీరా కేవలం పురుషులకే పరిమితమై వుంది. ఇప్పుడీ ఆడపిల్లలు ఆ ట్రెడిశాన్ నిబద్దలు చేసారు.
Categories