Categories
గుడ్డు చాలా మంచిదే అమేరికా లోని కర్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు సొనలోని కొలిన్ గర్భస్థ శిశువు తెలివితేటలు పెంచుతుందని నెలలు నిండిన వారు ప్రతిరోజూ 9 గుడ్లు తినడం మంచిది అంటున్నారు. ఒక్క గుడ్డులో 115 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని , గర్భవతి ఆరు నెలల నుంచి రోజుకు మూడు నాలుగు గుడ్లు తిన్నా పర్వాలేదు అని వీటి ద్వారా 450 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని అంటున్నారు. తొమ్మిది నెలల్లో 950 గ్రాముల కొలిన్లు శిశువుకు అవసరం అవ్వుతుంది కనుక రోజుకు 9 గుడ్లు తింటే మంచిదని అంటున్నారు. కాకపోతే ఇన్ని గుడ్లు తింటే కొలెస్త్రోల్ ప్రమాదం ఉందొ లేదో డాక్టర్లు తేల్చి చెప్పాలి మరి.