Categories
Nemalika

భావోద్వేగాలకు లోనై కర్చు పెడతాం.

నీహారికా,

ఒక రిపోర్టు చాలా ఆలోచించదగిన విషయాలు చెప్పుతుంది. మన భావొద్వేగాలు మనం పెట్టే కర్చులను ప్రభావితం చేస్తాయిట. దీన్ని బిహేవియిరేల్ ఎకనామిక్స్ అంటున్నారు నిపుణులు. మన ఉద్యోగాలను అదుపులో పెట్టుకోగలిగితే కర్చులు అదుపులోకి వస్తాయన్నమాట. సాధారణంగా మనస్సు’ బాగోకపోతే షాపింగ్ చేస్తాం. అవసరం కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తాం. మనం కొనే వస్తువుల వల్ల మనకి సంతోషం వస్తుందనే ఆలోచన వల్లనే కావొచ్చు. న్యాయానికి మన సంతోషం మన మనసులోనుంచి వస్తుందని కానీ మనం డబ్బు పెడితే కొనే వస్తువు కాదుకదా. మనం రెండు విధాలుగా నష్టపోతున్నాం. సంతోషం సెలబ్రేట్ చేసుకునేందుకు ఎదో ఒక్కటి కొంటాం మనస్సు అలా ప్రోత్సహిస్తుంది. అలాగే విపరీతమైన దుఖం, కోపం కూడా మనం సరైన నిర్ణయం తిడ్సుకునే శక్తిని లగేస్తుంది. సహజంగా ఆ డిప్రేషన్ మూడ్ లో నుంచి బయట పడెందుకు, మనస్సుని స్వాంతన పరిచేందుకు ఖరీదైన వస్తువులు మన ఆధిపత్యం నిరూపించుకొనేందుకు కుడా కొంటాం. నిపుణులు ఈ స్వభావాన్ని అదుపులో పెట్టుకుంటే మరింత ఖర్చులు పెట్టుకోకుండా ఉంటామంటారు.

Leave a comment