వాతావరణంలో వేడి పెరిగే సరికి ఎక్కడెక్కడో చీమలు, బొద్దింకలు, పురుగులు బయటకు వచ్చేస్తుంటాయి. ఇక వాటిని చంపేందుకు స్ప్రేలు, జెల్స్ ట్రాప్ లు కొనుక్కోవాలి. అయితే వీటితో పని లేకుండా ఇంట్లో వుండే వస్తువులతో ఈ కీటకాలను నిర్మూలించ వచ్చు. పావు కప్పు మౌత్ వాష్, పావు కప్పు నీళ్ళు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు బయట పడే సింకుల్లో అలమారాల్లో స్ప్రే చేస్తే తెల్లారే సరికి బొద్దింకలు పోటాయి. మౌత్ వాష్ లో ని పుదీనా పరిమళం బొద్దింకలు భరించ లేవు. కాఫీ పొడిని పల్చని గుడ్డలో కట్టి బొద్దింకలు వున్న చొట పెడితే ఆ వాసనకు బొద్దింకలు పోతాయి. మూడు వంతుల బోరాక్స్ పొడిని పావు వంతు పంచదారని కలిపి పురుగు పుట్రా చేరే రంద్రాల దగ్గర చల్లితే క్రీములు బయటకు వస్తాయి. వేప నూనె గానీ ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ ని గానీ విడి విడి గా తీసుకుని నీళ్ళు కలిపి స్ప్రే చేస్తే పురుగులు రాకుండా పోతాయి. ఇవి రాసాయినాలు కావు గనుక ప్రమాదం కూడా ఎమీ వుండదు.

Leave a comment