ఇప్పటివరకు కళారంగాన్ని శాసిస్తోంది మానవమాత్రులైన కళాకారులు, కానీ ఎరికా రోబో గత ఏడాది హాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ సంపాదించింది. జపాన్ శాస్త్రవేత్తలు హిరోషి  ఇషి గురో, కోహెయి బగావాలు  రూపొందించిన ఎరికా రోబో కుత్రిమ మేధి తో పనిచేస్తుంది బెల్జియం కు చెందిన హ్యాపీ మూన్ ప్రొడక్షన్, న్యూయార్క్ కు చెందిన టెన్ టెన్ గ్లోబల్ మీడియా సంస్థలు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఎరికా కీలక పాత్ర పోషిస్తోంది. గత ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ఈ సంవత్సరం యూరప్ లో షూటింగ్ జరగనున్నదని చిత్ర దర్శకుడు టోనీ కె  ప్రకటించారు.

Leave a comment