Categories
వ్యాయామం రోటీన్గా చేయడం బోర్ గా వుంటే వయస్సు ఏదయినా పర్లేదు ఇప్పటికైనా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టండి అంటున్నారు వ్యాయామ గురువులు మెచ్చిన శాస్త్రీయ, పాశ్చాత్య, సినిమా నృత్యం ఏదయినా సరే ఓ గంట పాటు ప్రాక్టీస్ చేస్తే శరీరానికి ఎంతో శ్రమ అందుతుంది. డాన్స్ వల్ల మనస్సు ఉల్లాసంగా వుంటుంది. ఇది కొత్త అభిరుచి మాత్రమే కాదు కండరాళ్ళకు మంచి కదలిక, శరీరాన్ని సాగదీసే ప్రక్రియ కూడా. డాన్స్ ఏకాగ్రత పెంచుతుంది. శరీరానికి మెదడుకు సమన్మయం అందిస్తుంది ఫలితంగా అధిక బరువు అదుపులోకి వస్తుంది.