Categories
టినేజ్ లో వచ్చే మొదటి సమస్య మొటిమలు. ఇవి కాస్త గిల్లిన రుద్దిన పుళ్ళయిపోయి మచ్చలు పడిపోతాయి. మొహం అంతా నిండే మచ్చలు ఒక పట్టానా ఏ మందులకు లొంగవు కూడా. మొఖం పై మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని సంహరించగల శక్తి కలిగిన
టీకాను కనిపెట్టారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆ బ్యాక్టీరియా తర్వాత కూడా ఇబ్బంది పెట్టనియని విధంగా
ఈ టీకాను తయారు చేశారు. చర్మం పై చేరిన బ్యాక్టీరియా స్రవించే ఒక ప్రోటీన్ వల్ల కురుపులు వస్తాయి. ఆ ప్రోటీన్ ను ఎదుర్కుంటుంది ఈ టీకా. ఈ మందుతో మొహం పై మచ్చలు, కురుపులు సమస్య తీరిపోతుంది.